Friday 6 November 2020

 కర్ణాటక శాస్త్రీయ సంగీతం : 5.

గానకళ   పరిణామక్రమం ..( evolution of music )....  మనిషి   ఎప్పటివాడో    గానకళ   కూడా   అంత   పురాతన మైనది.  మనిషే   కాకుండా   సృష్టి లోని   ప్రతీది   నాద మయమే . ఎదో  విధమైన సంగీత ధ్వని ప్రతి   కణమందునూ  ఉన్నది.  చిన్నదైన   గుండె చప్పుడు నుండి,  గంభీరమైన   మేఘ   ఘర్జన   వరకూ   అన్నీ   సంగీత  ధ్వనులే .   సెలయేళ్ల గల గల , సముద్రపు అలల   ఘోష,  కోకిల   కుహూరావాలు,  తుమ్మెదల   ఝుంకారము,  ఆవు  దూడల   అంబారావములు   అన్నీ   సంగీత నాదములే.


చారిత్రక   ఆధారములు   లభించినంత   వరకు  క్రీ. పూ . సుమారు   5 వేల సం. కిందటి దైన  ఋగ్వేదం ను   ఒకే శైలి   యగు   స్వరితలో   పాడుచుండెడి  వారు,  అది నేటి మధ్య షడ్జమం   కు   సరిపోతుంది... స .   తర్వాత  తర్వాత   ఋగ్వేదం   ఏకస్వర   కొలతకు   కింద  ( స్వరితం కింద )  అనుదాత్తం  .. ని  అనే  స్వరం ,  ఎగువన   ఉదాత్తం ... రి   అనే స్వరాలూ   కలిపి   పాడడం   మొదలు పెట్టారు.

ఏక స్వరం   లో  పాడే   ఋగ్వేద  గానం....ఆర్చిక   గానం ...స 

ద్విస్వరాలతో      ""         ""           ""  .....గాధిక  గానం ... ని  స 

త్రి స్వరాలతో        ""         ""          ""   ......సామిక  గానం ...ని  స రి 


ఇందులోని   మంద్ర  నిషాధం   అనుదాత్తం;   షడ్జమం   స్వరితం;   రిషభం    ఉదాత్తం .   కొన్నాళ్ళకు   మంద్ర స్థాయిలో   దైవతం,   మధ్య స్థాయిలో   గాంధారం   చేరి  పంచమ స్వర   కొలతగా    మారింది.   ఇంకా   కొంత   కాలానికి   మంద్ర స్థాయిలో  పంచమం,   మధ్య స్థాయిలో  మధ్యమం   చేరి  సప్తస్వర   కొలతగా  మారింది.   ఇదే   సామవేద   కాలము.

క్రీ. పూ.  3   వేల సం.   లో   ప ద ని స రి  గ మ    గా   స్థిరపడింది.   దీనినే   సామ గాన  మేళం   అంటారు.  ఇప్పటి   చిత్తరంజని   రాగం   ఈ  మేళం  కు దగ్గరగా  ఉంటుంది. ఈ రాగం  లో త్యాగయ్య   గారు  " నాద   తను  మనిశం "   అనే  కృతి   రచించారు.


సామగాన  మేళ  స్వరాలకు   కొద్దిగా   దగ్గరగా  ఉండే   నేటి   మేళ కర్తలు...భైరవి,   ఖరహర ప్రియ.  ప ద ని స రి గ మ  లో   ప ద ని స   అనే స్వర సంపుటి   మధ్యమ స్థాయిలో   కూడా   వచ్చినప్పుడు  ...నేటి   సప్త స్వరములు   స రి  గ  మ  ప  ద  ని     గా   మారినవి.  ఇది సంపూర్ణ మేళం  ( heptatonic   స్కేల్ ).  ఈ పరిణామం   భారతీయ సంగీత చరిత్రలో   గొప్ప మలుపు.   ఆ   తరువాత   షడ్జ,  గాంధార, మధ్యమ  గ్రామాలు,   ద్వాదశ,   షోడశ,  ద్వావింశతి   స్వర స్థానాలు,   72  మేళ కర్తలు ,  అసంఖ్యాక మైన  వాటి   జన్య రాగాలతో   నేటి కర్ణాటక   సంగీతం   సుసంపన్న మైంది .   ప్రపంచ   సంగీతం   లో   అగ్రగామిగా   నిలబడింది.

ఈజిప్ట్,  ఇరాక్-ఇరాన్ , గ్రీస్, చైనా, జపాన్, ఇండోనేషియా   మొదలైన    దేశాల  సాంప్రదాయ   సంగీతం   పాశ్చాత్య  సంగీత  ప్రభావానికి   లోనై   నేడు  దాదాపు   రూపు  మాసి  పోయాయి.

కానీ   దాదాపు 10 వ శతాబ్దం   నుండి   ముస్లిముల   దండయాత్రల వల్ల గానీ ,  వారి   రాజ్యాధికారం   వల్ల గానీ,  16 వ శతాబ్దం   నుండి   19 వ శతాబ్దం   వరకూ   ఆంగ్లేయుల  వలస అధికారం  వల్లగానీ   కర్నాటక   సంగీతం   ఏ మాత్రం   తన స్వంత  ప్రతిపత్తిని   కోల్పోకుండా, పైగా   ఎంతో   అభివృద్ధి   చెందింది.  పాశ్చాత్య   వాయిద్యాలు   అయిన   వయోలిన్,   మాండొలిన్ , సాక్షఫోన్   వంటి  వాటిని కర్ణాటక  సంగీతానికి బాణీకి   అనుగుణంగా   మార్చుకుని, మలుచుకుని   వాటిలో   ప్రావీణ్యం   సంపాదించి  కర్ణాటక  సంగీతం  లో  భాగంగా   చేర్చుకున్నారు  ఈ  కాలం   లో.   


ఇంకా   ఆశ్చర్యకరమైన  విశేషమేమంటే, భారతదేశం   ఆంగ్లేయుల   వలస పాలన లో   ఉన్న   కాలం లోనే   సంగీత   త్రిమూర్తులు,  వారి   శిష్య , ప్రశిష్యుల   వల్ల  కర్ణాటక  సంగీతం సుసంపన్న   మైంది.  ముత్తుస్వామి దీక్షితులు   పాశ్చాత్య  బ్యాండు  మేళం   విని   ( మేజర్  స్కేల్ - శంకరాభరణం )   స్వరాలతో   35  చిన్న కృతులు ( ముచుకుంద వరద ) రచించారు.

దీక్షితులవారు    బృందావన సారంగ   రాగం  లో   రచించించిన   ' శ్రీ  రంగపుర  విహార ' కృతి  బ్రిటిష్ జాతీయ   గీతమైన  ' ఓ  గాడ్   సేవ్  ది  కింగ్ '   పాటను   పోలియున్నది.

ఇన్ని  ఒడిదుడుకులను   తట్టుకొన  గలిగిన   కర్ణాటక   సంగీతం ...నేడు భారతదేశం   స్వాతంత్ర్య  దేశమైనా...సాస్క్రుతికంగా    పాశ్చాత్య   వాసనలకు   లోనై,  యువత  MTV  వంటి చానళ్ళ   ప్రభావానికి   లోనై   కర్ణాటక  సంగీతాన్ని   చిన్న చూపు   చూస్తున్నారు.  John  Higgins  లాంటి    పాశ్చాత్యులు     ఆరాదించి  సాధించిన   కర్ణాటక  సంగీతాన్ని మనం   దూరం   చేసుకోకూడదు.  అయితే  ఈ మధ్య కొన్ని   TV   చానళ్ళు   కర్ణాటక  సంగీతం   అభివృద్దికి   దేశ, విదేశాల్లో   పోటీలు   నిర్వహించి   యువతలో   ఉన్న ప్రతిభను   వెలికి  తీసుకొస్తున్నారు .  ప్రభుత్వం   కూడా   పాఠశాలల్లో   సంగీతం   ఒక   అంశంగా   తప్పనిసరి   చేస్తే...కర్ణాటక  సంగీతం  భవిష్యత్తులో   ఉజ్వలంగా  ఉండే అవకాశం   ఉంటుంది.


ఎవరు   మునిగినా   మునగక   పోయినా   భారత దేశం  లో  ఉత్తరాన   గంగమ్మ తల్లి ,  దక్షిణాన   కావేరి మాత  శతాబ్దాల   తరబడి   నిరంతరం   అప్రతిహాతంగా   ప్రవహిస్తూనే   ఉంటుంది.

 అలాగే కర్ణాటక    సంగీతం   కూడా............


స్వస్తి  ఇతిః.....శుభం భూయాత్.

 కర్ణాటక శాస్త్రీయ సంగీత విశిష్టత: 4 


ఇప్పటివరకూ మనం కర్ణాటక సంగీతం లో తెలుగు భాష నిర్వహించిన పాత్రను తెలుసుకున్నాము.  ఇప్పుడు కర్ణాటక సంగీతం గొప్పదనం ఏమిటో తెలుసుకుందాం.

ప్రపంచం లో ఎన్నో సంగీత రీతులు ఉన్నాయి, పాశ్చాత్య దేశాలలో  ఇటాలియన్, స్పానిష్, అరబిక్, జపనీస్, చైనీస్ మొదలైనవి చాలా ఉన్నాయి. వాటికీ మన భారతీయ సంగీతానికి  ఉన్న ముఖ్యమైన తేడా ఒకటి ఉన్నది. పాశ్చాత్య సంగీతం హార్మొనీ ప్రధానమైనది...కొన్ని స్వరాలు  కలిసి ఒక కార్డ్  అవుతుంది. వాటి సహాయం తో మెజర్ కార్డ్ మైనర్ కార్డ్  అని కొన్ని   కార్డ్స్  కలయికతో   రాగాలు ఏర్పడుతాయి. పిచ్ లేక శృతి మారుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో కేవలం 12 స్వరాలు మాత్రమె ఉంటాయి. రాగాలు చాలా తక్కువ.  ఒకసారి నోటేషణ్ రాస్తే దానిని కళాకారులు అనుసరించాల్సి వస్తుంది. స్వతంత్రంగా పాడే\వాయించే వీలు లేదు.


భారతీయ సంగీతం లో సప్త స్వరాలు, వాటి 16 రకాల  మేలవింపుతో  రాగాలు ఏర్పడతాయి. ఇవి మెలోడి ప్రధానమైనవి. స్వరాల కలయిక ఒక నిర్దుష్టమైన పద్ధతిలోనే  ఏర్పడుతాయి. ఇందులో శృతి మారదు. ఈ సంప్రదాయం లో మనోధర్మ సంగీతం అనే ప్రక్రియ ఉంటుంది. ఇందులో కళాకారుడు తన మేధస్సుతో, స్వతంత్రంగా అప్పటికప్పుడు రాగాలాపన, స్వరకల్పన,  సంగతులు వేయవచ్చు .


సప్త స్వరములు   7...వాటిలో   షడ్జమం,  పంచమం   లు   అచలములు   అనగా   ప్రక్రుతి స్వరములు. మిగతా   రి గ మ ద ని   లకు  మాత్రం   ప్రక్రుతి, వికృతి   బేధములతో    పది   స్వరములు   అవుతాయి .  ఈ పది   స్వరములను  స  ప   లతో   చేర్చి   ప్రస్తరించి  నట్లైతే    32   రాగములు   వచ్చును.   ఇట్టి విధానము   ప్రపంచము   లోని  అన్ని సంగీత పద్ధతులలోనూ   ఉన్నది.   ఇట్టి    32  మేళ  రాగముల   పట్టికలో   8 వ మేళకర్త   హనుమత్తోడి    మొదటి   రాగముగా   వచ్చును.


కానీ  ప్రాచీన కర్ణాటక   సంగీత   శాస్త్రజ్ఞులు   తమ   తపో,  మేధాశ్శక్తిని   ఉపయోగించి   12   స్వర స్థానములను  16   ప్రకృతి, వికృతి   స్వర స్తానములుగా    తాత్కాకాలికంగా    ఏర్పాటు చేసి,   వాటిని   ప్రస్తారించినచో  72   మేళకర్త   రాగములు   వచ్చును.    ఇన్ని   మేళకర్త   రాగములు   ప్రపంచం   లోని   ఏ   సంగీత  పద్ధతిలోనూ,   చివరకి   హిందుస్తానీ   సంగీతం  లోనూ   లేవు.


1869 లో రష్యన్ శాస్త్రజ్ఞుడు దిమిత్రి  మెండలీవ్...అప్పటివరకూ  ఉన్న 63 మూలకాలతో  ఒక పీరియాడిక్ టేబుల్  తయారు చేశాడు. డానికి ఈ నాట యాభై  ఏళ్లలో  55 కొత్త మూలకాలు చేర్చపడ్డాయి....ఇకముందు కూడా  కొత్త కొత్తవి  కనుక్కోవచ్చు.


17 వ శతాబ్దం కు చెందిన  వేంకటమఖి అనే విద్వాంసుడు 72  మేలకర్తల పథకం తన చతుర్దండి ప్రకాశిక అనే గ్రంధం లో ప్రకటించాడు. ఇప్పటి వరకు 3 శతాబ్దాలు గడిచాయి కానీ ఒక్క కొత్త మేలకర్తను ఎవరూ  కనుగొన లేకపోయారు....వచ్చే 30 శతాబ్దాల వరకూ  కూడా ఏ కొత్త మేళకర్తను  కనుగొనే అవకాశం లేదు.

అంత నిర్దుష్టంగా  తయారు చేశారు వెంకటమఖి  ఈ పథకాన్ని.


సామగాన  మేళ  స్వరాలకు   కొద్దిగా   దగ్గరగా  ఉండే   నేటి   మేళ కర్తలు...భైరవి,   ఖరహర ప్రియ.  ప ద ని స రి గ మ  లో   ప ద ని స   అనే స్వర సంపుటి   మధ్యమ స్థాయిలో   కూడా   వచ్చినప్పుడు  ...నేటి   సప్త స్వరములు   స రి  గ  మ  ప  ద  ని     గా   మారినవి.  ఇది సంపూర్ణ మేళం  ( heptatonic   స్కేల్ ).  ఈ పరిణామం   భారతీయ సంగీత చరిత్రలో   గొప్ప మలుపు.   ఆ   తరువాత   షడ్జ,  గాంధార, మధ్యమ  గ్రామాలు,   ద్వాదశ,   షోడశ,  ద్వావింశతి   స్వర స్థానాలు,   72  మేళ కర్తలు ,  అసంఖ్యాక మైన  వాటి   జన్య రాగాలతో   నేటి కర్ణాటక   సంగీతం   సుసంపన్న మైంది .   ప్రపంచ   సంగీతం   లో   అగ్రగామిగా   నిలబడింది.


వచ్చే  పోస్టులో  విదేశీయులు  భారత దేశానికి రాకముందు సంగీతం ఎలా ఉంది.  ప్రపంచం లోని ప్రాచీన సంగీత రీతులు  విదేశీయుల దండయాత్రల వాళ్ళ ఎలా  కనుమరుగయ్యాయో  చూద్దాం.

 కర్ణాటక శాస్త్రీయ  సంగీత విశిష్టత- 3 


ఇంతవరకూ  తెలుగు భాష విశిష్టత, వర్ణమాల విశిష్టత చూశాము కదా...మిగతా భాషల్లో  ఎందులోనూ లేనిది   మన  తెలుగు భాషలో ఒక సౌలభ్యం ఉన్నది అది ఏమిటంటే తెలుగులో మనం ఏమి మాట్లాడతామో అదే లిపిలో రాస్తాము. అందుకనే పూర్వము స్త్రీలు రెండవ తరగతి చదివిన వారైనా  నవలలు, పత్రికల్లో వచ్చే సీరియల్స్ చదవగలిగే  వారు. ఎందుకంటే తెలుగు వర్ణమాల లోని అక్షరాలు అన్నీ  అక్షరం వచ్చే స్థానాన్ని బట్టి  ఏర్పరిచారు ఇలా......


ఉత్పత్తి స్థానములు


కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.                                             

తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.                                     

మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.            

దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.                              

ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.                                      

నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.                             

కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.                                           

కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.

దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.


కంఠము, దవడలు,అంగిలి (palat), దంతములు, పెదవులు మరియు ముక్కు  నుండి వచ్చే అక్షరాలుగా ఎలా ఏర్పరిచారో చూడండి.  సరే ఈ ఉత్పత్తి స్థానాలకూ మన   స ప స  లకు ఏమి సంబంధమో చూడండి.


స-  దంత్యములు ..దంతములనుండి పుట్టినది.    

రి-   మూర్ధన్యము ..అంగిలి పై భాగము నుండి పుట్టినది.          

గ -  కంఠ్యములు :... కంఠము నుండి పుట్టినది. 

మ-  అనునాసికములు...నాసిక నుండి పుట్టినది.

ప -  ఓష్ఠ్యములు ... పెదవుల నుండి పుట్టినది.

ద -  దంత్యములు ... దంతముల నుండి పుట్టినది. 

ని-   అనునాసికములు... నాసిక నుండి పుట్టినది.


ఇందులో...

సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేది... .గ...గాంధారం.

పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేది .....  ప...పంచమం 

స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులు  స్థిరములు. ఇవి  స, రి, మ, ద, ని



ఇప్పుడు  స రి గ మ ప ద ని లను   క్రమంగా పాడి చూడండి....అవి   గొంతు నుండి ముక్కు వరకు  ఎలా పలుకుతున్నాయో   గమనించండి. ఇలా ఆరోహణ, అవరోహణ , స్వర ప్రస్తారం , స్వర కల్పన చేస్తే  ఉశ్చ్వాస, నిశ్వాసాలు క్రమబద్ధంగా జరిగి ....శరీరమంతా ముఖ్యంగా మెదడుకు   ఆక్సీజన్ కలిగిన మంచి రక్తం ప్రసారం అయి మన ఆరోగ్యం, ఆలోచనలు  మంచిగా ఉంటాయి.

 

సరే తెలుగు భాషకూ  కర్ణాటక సంగీతానికి గల సంబంధం చూశాము కదా ఇప్పుడు ప్రపంచం లోని ఇతర సంగీత విధానాల కంటే మన కర్ణాటక సంగీతం ఎందుకు 

 


కర్ణాటక శాస్త్రీయ సంగీత విశిష్టత-2 

స ప స ల గురించి తరువాత చూద్దాం. అసలు కర్ణాటక సంగీతం లో శీర్ష భాగం రచనలు తెలుగులోనే ఉన్నాయి. సంగీత త్రిమూర్తులు ముగ్గురూ తంజావూరు పరిసరాలలో పుట్టి పెరిగినా చాలా వరకు తెలుగు, సంస్కృతం లోనే వారి రచనలు చేశారు. ఎందుకు? తెలుగు భాషలోని గొప్పదనం   ఏమిటి? కృష్ణ దేవరాయలు 

"దేశ భాషలందు తెలుగు లెస్స  అని అన్నా,  16వ శతాబ్దం లో నికొలో డి కాంటి  అనే ఇటాలియన్ తెలుగు భాషను  " ఇటాలియన్ ఆఫ్ ద  ఈస్ట్ " అని అన్నా...

కారణం ఏమిటి ? 

ఎందుకంటే తెలుగు భాషలో పదాలు అచ్చులతో ముగుస్తాయి. హిందీ ఇతర భాషల్లో హల్లులతో  ముగుస్తాయి. 2012 లో  ఇంటర్ నేషనల్ అల్ఫాబెట్ అసోసియేషన్ 

వారిచే  తెలుగు భాష ప్రపంచం లో కెల్లా రెండవ బెస్ట్ స్క్రిప్ట్  గా ఎన్నుకున్నారు, మొదటిది కొరియన్ భాష. పదాలు అచ్చులతో ముగిస్తే రాగాలాపన కు చాల అనుకూలంగా ఉంటుంది. 

తెలుగు భాషలో ఇన్ని గొప్పదనాలు ఉన్నాయి కాబట్టి  ఇందులోని వర్ణమాలను ఒకసారి చూద్దాం.

అచ్చులు-16 

ఉభయాక్షరమలు-3 

హల్లులు-38

క్ష


అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:

1. హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.

2. దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.

3. ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.

 

హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.

హల్లులు కూడా మూడు రకములు:

1. సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.

2. పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప

3. స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.


ఇవన్నీ మేము చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలో చదివాము అని అనుకుంటున్నారా?  ఇక్కడే సంగీతానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం వస్తుంది. ఆది  ఏమిటో తరువాత పోస్టులో మనవి చేసుకుంటాను.

కర్ణాటక శాస్త్రీయ సంగీత విశిష్టత: 1

******************************


2  ఫిబ్రవరి  1980 రోజున విడుదలైన శంకరాభరణం  తెలుగు  సినిమాలలో ఒక ప్రభంజనం సృష్టించింది. 

అందులో ఒక సన్నివేశం. రాత్రి శంకర శాస్త్రి పడుకుని ఉంటాడు , శిష్యుడు మానస సంచరరే కీర్తన పాడుతుంటే సరి చేస్తుంటాడు. అంతలో ఎదురింటి మేడమీద నుండి పాశ్చాత్య సంగీత వాయిద్యాల హోరు వినబడుతుంది. అక్కడికి వెళ్లి " అర్ధరాత్రి అపరాత్రి ఇలా గావుకేకలు వేయడం తప్పు " అని అంటాడు డానికి వాళ్ళు వాళ్ళు మావి గావుకేకలా, రోజుకు 24 గంటలు ప్రాక్టిస్ చేసినా పాప్  మ్యూజిక్ లో పావువంతు కూడా రాదు, ఇదేమన్నా  మీ సరిగమపదని స్వరాలతో గంటలకు గంటలు లాగుడు  సంగీతం  అనుకుంటున్నారా ? మీ సంగీతం కేవలం ఒక్క నిమిషం లో నేర్చుకోవచ్చు అదే మా సంగీతం పెద్ద సముద్రం మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, లెఫ్ట్ మేజర్, రైట్ మేజర్ అని ఎంతో ఉన్నది.

శంకరశాస్త్రి: అంత కష్టమయిందా ఆ  సంగీతం?

గుంపు:  కష్టమా? ఇందులో  మూడు అక్షరాలు  పలకాలంటే మీరు మూడు చెరువుల నీళ్ళు తాగాలి.

శంకరశాస్త్రి: అలాగా ఏదీ ఒక్కసారి అనండి చూద్దాం.

గుంపు: ఒక మేజర్ స్కేల్ ముక్క పాడతారు. 

దానిని  అలాగే శృతి బద్ధంగా పాడి ....

శంకరశాస్త్రి: ఏదీ  మనదేదో  స ప స  సంగీతం అన్నారు నేనొక రాగం పాడతాను పాడండి చూద్దాం అని మధ్యమావతి రాగం కొద్దిగా పాడతారు.

గుంపు:  పై రిషభం వరకు వెళ్లేసరికి గొంతు కీచుమని ఆగిపోతుంది. 

శంకరశాస్త్రి: here after don't be silly,  stupid and childish. music is divine whether it is western or Indian. సంగీతానికి భాషా భేదాలు, స్వ పర భేదాలు ఉండవు. ఆది  ఒక అనంతమైన అమృత వాహిని. ఏ జాతి వాడైనా , ఏ మతం వాడైన, ఏ దేశం వాడైనా ఆ జీవ ధారలో దాహం తీర్చుకోవచ్చు.ఒక రకమైన సంగీతం గొప్పదనీ, మరొక రకమైన సంగీతం అధమ మైనదని నిర్ణయించడానికి మన మెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని ఇలా  అవహేళన చేయడం మూర్ఖత్వం.   మన భారతీయ సంగీతపు  ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయు లేందరో మన పుణ్య భూమి మీద  ఆ ప్రణవ నాదాన్ని సాధన చేస్తుంటే, ఈ భూమిలో   పుట్టిన బిడ్డలు మీరే మన  దేశపు సంగీతాన్ని చులకన చేయడం కన్నతల్లిని దూషించినంత నేర, ద్వేషించినంత పాపం.


అయితే మన భారతీయ సంగీతం కేవలం ఏడు అక్షరాలు తీసుకుని, స ప స అంటూ గంటలు గంటలు లాగడమేనా? ఇంకా ఏమైనా  మహాత్యం ఉందా?

Tuesday 27 October 2015

వందే వాల్మీకి కోకిలం

మహర్షి  వాల్మీకి 
నారదుడు  వాల్మీకి  కి   రామ  మంత్రం  ఉపదేశించుట   

   


 ఆశ్వీయుజ పౌర్ణమి - మహర్షి వాల్మీకి  జయంతి  నేడు :

मां निषाद प्रतिष्ठां a bird in love and unsuspecting.

 त्वमगमः शाश्वतीः समाः। 

यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥'

mā niṣāda pratiṣṭhāṁ tvamagamaḥ śāśvatīḥ samāḥ

yat krauñcamithunādekam avadhīḥ kāmamohitam

You will find no rest for the long years of Eternity  For you killed

బోయవాని  దెబ్బకు   చనిపోయిన క్రౌంచ పక్షి 

 














కూజింతం రామ  రామేతి  మధురాక్షరం 

అరూహ్య కవితా  శాఖాం  వందే  వాల్మీకి  కోకిలమ్


Saturday 17 October 2015

తమిళ కవి రాజు - కన్నదాసన్ వర్ధంతి నేడు

తమిళ  కవిరాజు  కన్నదాసన్  వర్ధంతి ( 17 అక్టోబర్ 1927 )

కన్నదాసన్  

కన్నదాసన్  వర్ధంతి   నేడు : ( 24  జూన్  1927 -- 17 అక్టోబర్ 1981 )

24 జూన్ 1927  నాడు   తమిళనాడు లోని   సిరుకూడల్పట్టి  లో పుట్టిన  A. L. ముత్తయ్య   పుట్టాడు. మొదట్లో  నాస్తికుడిగా   ఉన్న  ముత్తయ్య  కన్నన్   అనే  తమిళ సంఘ సంస్కర్త  మీద   అభిమానం   తో   తన పేరును   కన్నదాసన్   గా   మార్చుకున్నాడు.

కాని ఒకసారి  ఆండాళ్   తిరుప్పావై   చదివి  అందులోని  సాహిత్యానికి   ముగ్ధుడై  ఆస్తికునిగా  మారాడు.  హిందూ మతం గొప్పదనం గురించి 10 సంపుటాల  ' అర్థ ముళ్ళ  హిందూమత ' అనే గ్రంధం రాశాడు.  తమిళ ప్రజలు కన్నదాసన్   ను   కవి అరసు ( కవిరాజు) గా పిలుచుకుంటారు.  ' చేరమాన్ కడలి ' నవలకు   కేంద్ర సాహిత్య అకాడెమీ  అవార్డ్  వచ్చింది. కంబ  రామాయణం  రాసిన  కంబన్  అంటే  కన్నదాసన్ కు ఎంతో  అభిమానం.

సుమారు   5000  తమిళ  సినిమా  పాటలు   రాసిన  కన్నదాసన్  అటు తమిళ  సాహిత్యం లో కూడా  ఎన్నో రచనలు   చేశారు. సినీ గీతాల్లో కూడా   సాహిత్య  విలువలు  నిలిపిన   రచయిత  కన్నదాసన్. 

అమెరికా  లోని చికాగో  లో  జరిగిన  తమిళ సభలకు   వెళ్లి   17 అక్టోబర్ 1981  లో పరమపదించారు  కన్నదాసన్  గారు.

టి. ఎం. సౌందర్ రాజన్ 


ఆర్. సుదర్శనం 





పూపోల  పూపోల - నానుం  ఒరు  పెన్ 

రచన:  కన్నదాసన్ ;   గానం:  టి. ఎం. సౌందర్ రాజన్, పి. సుశీల;    సంగీతం:   ఆర్. సుదర్శనం.


పూపోల పూపోల  పిరక్కుం                  #   పువ్వులాగా   పుడతాడు 

పాల్ పోల   పాల్  పోల   శిరిక్కుం          #   పాల లాగా  నవ్వుతాడు 


మాన్ పోల మాన్ పోల  తుళ్లుం            #    జింక  లాగా   గెంతుతాడు 

తేన్  పోల  ఇదయత్  తై   అళ్ళుమ్       #    తేనే  లాగా  మనసు  దోస్తాడు 


మలర్ పోల  శిరిక్కిన్ర పిళ్ళై                   #    పువ్వు లాగా  నవ్వే  పాపాయిని 

కండు  మగిలాద  ఉయిరోన్రుం  యిల్లై     #     చూసి  ఆనందించని  జీవి   ఉండదు 


మడిమీదు  తవల్గిన్ర   ముళ్ళై                 #     లోపల కదిలే  పాపను  చూశాను 

మళ లైచ్చోల్ ఇన్ బత్తిన్ ఎల్లై                #      వాడి   రూపాన్ని  ఎప్పుడు  చూస్తానో 


ఉళ్  కాడుం   ఉయిరోన్రు కండేన్            #      తనలో పెరుగుతున్న  పాపాయిని                 

అవన్  ఉరువతై  నాన్ ఎన్రు   కాన్బేన్     #      తను  ఎప్పుడు   చూడగలనో 


తల్లా  తల్లాడి   వరువాన్                      #      చిట్టి అడుగులు వేస్తూ  వస్తాడు 

తనియాద ఇన్ బత్ తై   తరువాన్.       #       తరగని  ఆనందాన్ని  ఇస్తాడు 



 







***************************************************

చిత్రం:  నాదీ   ఆడజన్మే -- చిన్నారి  పొన్నారి  పువ్వు .

రచన: దాశరథి;   సంగీతం:  ఆర్.  సుదర్శనం;   అభినయం:  ఎన్టీఆర్ , సావిత్రి 

****************************************************

చిన్నారి పొన్నారి పువ్వూ 

విరబూసి విరబూసి  నవ్వూ 

మన ఇంటి పొదరింటి  పువ్వూ 

నిను చూసి  నను చూసి  నవ్వూ             ||చిన్నారి||


హృదయాన  కదలాడు  బాబూ

రేపు ఉయ్యాల  జంపాల లూగూ 

పసివాడు  పలికేటి  మాటా 

ముత్యాల  రతనాల   మూట                    ||చిన్నారి||


ఒడిలోన   పవళించు వేళా 

నేను పాడేను ఒక జోల పాటా 

కను మూసి నిదురించు బాబూ 

కలలందు   దోగాడ గలడు                        ||చిన్నారి||

దాశరథి 
పి. బి. శ్రీనివాస్ - ఘంటశాల 
పి. సుశీల 














***************************************************************** 
లత
చిత్రగుప్త 


పి. బి. శ్రీనివాస్ 


క్రిషణ్ చందర్