Friday, 6 November 2020

 


కర్ణాటక శాస్త్రీయ సంగీత విశిష్టత-2 

స ప స ల గురించి తరువాత చూద్దాం. అసలు కర్ణాటక సంగీతం లో శీర్ష భాగం రచనలు తెలుగులోనే ఉన్నాయి. సంగీత త్రిమూర్తులు ముగ్గురూ తంజావూరు పరిసరాలలో పుట్టి పెరిగినా చాలా వరకు తెలుగు, సంస్కృతం లోనే వారి రచనలు చేశారు. ఎందుకు? తెలుగు భాషలోని గొప్పదనం   ఏమిటి? కృష్ణ దేవరాయలు 

"దేశ భాషలందు తెలుగు లెస్స  అని అన్నా,  16వ శతాబ్దం లో నికొలో డి కాంటి  అనే ఇటాలియన్ తెలుగు భాషను  " ఇటాలియన్ ఆఫ్ ద  ఈస్ట్ " అని అన్నా...

కారణం ఏమిటి ? 

ఎందుకంటే తెలుగు భాషలో పదాలు అచ్చులతో ముగుస్తాయి. హిందీ ఇతర భాషల్లో హల్లులతో  ముగుస్తాయి. 2012 లో  ఇంటర్ నేషనల్ అల్ఫాబెట్ అసోసియేషన్ 

వారిచే  తెలుగు భాష ప్రపంచం లో కెల్లా రెండవ బెస్ట్ స్క్రిప్ట్  గా ఎన్నుకున్నారు, మొదటిది కొరియన్ భాష. పదాలు అచ్చులతో ముగిస్తే రాగాలాపన కు చాల అనుకూలంగా ఉంటుంది. 

తెలుగు భాషలో ఇన్ని గొప్పదనాలు ఉన్నాయి కాబట్టి  ఇందులోని వర్ణమాలను ఒకసారి చూద్దాం.

అచ్చులు-16 

ఉభయాక్షరమలు-3 

హల్లులు-38

క్ష


అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:

1. హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.

2. దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.

3. ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.

 

హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.

హల్లులు కూడా మూడు రకములు:

1. సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.

2. పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప

3. స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.


ఇవన్నీ మేము చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలో చదివాము అని అనుకుంటున్నారా?  ఇక్కడే సంగీతానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం వస్తుంది. ఆది  ఏమిటో తరువాత పోస్టులో మనవి చేసుకుంటాను.

No comments:

Post a Comment