Friday, 6 November 2020

కర్ణాటక శాస్త్రీయ సంగీత విశిష్టత: 1

******************************


2  ఫిబ్రవరి  1980 రోజున విడుదలైన శంకరాభరణం  తెలుగు  సినిమాలలో ఒక ప్రభంజనం సృష్టించింది. 

అందులో ఒక సన్నివేశం. రాత్రి శంకర శాస్త్రి పడుకుని ఉంటాడు , శిష్యుడు మానస సంచరరే కీర్తన పాడుతుంటే సరి చేస్తుంటాడు. అంతలో ఎదురింటి మేడమీద నుండి పాశ్చాత్య సంగీత వాయిద్యాల హోరు వినబడుతుంది. అక్కడికి వెళ్లి " అర్ధరాత్రి అపరాత్రి ఇలా గావుకేకలు వేయడం తప్పు " అని అంటాడు డానికి వాళ్ళు వాళ్ళు మావి గావుకేకలా, రోజుకు 24 గంటలు ప్రాక్టిస్ చేసినా పాప్  మ్యూజిక్ లో పావువంతు కూడా రాదు, ఇదేమన్నా  మీ సరిగమపదని స్వరాలతో గంటలకు గంటలు లాగుడు  సంగీతం  అనుకుంటున్నారా ? మీ సంగీతం కేవలం ఒక్క నిమిషం లో నేర్చుకోవచ్చు అదే మా సంగీతం పెద్ద సముద్రం మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, లెఫ్ట్ మేజర్, రైట్ మేజర్ అని ఎంతో ఉన్నది.

శంకరశాస్త్రి: అంత కష్టమయిందా ఆ  సంగీతం?

గుంపు:  కష్టమా? ఇందులో  మూడు అక్షరాలు  పలకాలంటే మీరు మూడు చెరువుల నీళ్ళు తాగాలి.

శంకరశాస్త్రి: అలాగా ఏదీ ఒక్కసారి అనండి చూద్దాం.

గుంపు: ఒక మేజర్ స్కేల్ ముక్క పాడతారు. 

దానిని  అలాగే శృతి బద్ధంగా పాడి ....

శంకరశాస్త్రి: ఏదీ  మనదేదో  స ప స  సంగీతం అన్నారు నేనొక రాగం పాడతాను పాడండి చూద్దాం అని మధ్యమావతి రాగం కొద్దిగా పాడతారు.

గుంపు:  పై రిషభం వరకు వెళ్లేసరికి గొంతు కీచుమని ఆగిపోతుంది. 

శంకరశాస్త్రి: here after don't be silly,  stupid and childish. music is divine whether it is western or Indian. సంగీతానికి భాషా భేదాలు, స్వ పర భేదాలు ఉండవు. ఆది  ఒక అనంతమైన అమృత వాహిని. ఏ జాతి వాడైనా , ఏ మతం వాడైన, ఏ దేశం వాడైనా ఆ జీవ ధారలో దాహం తీర్చుకోవచ్చు.ఒక రకమైన సంగీతం గొప్పదనీ, మరొక రకమైన సంగీతం అధమ మైనదని నిర్ణయించడానికి మన మెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని ఇలా  అవహేళన చేయడం మూర్ఖత్వం.   మన భారతీయ సంగీతపు  ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయు లేందరో మన పుణ్య భూమి మీద  ఆ ప్రణవ నాదాన్ని సాధన చేస్తుంటే, ఈ భూమిలో   పుట్టిన బిడ్డలు మీరే మన  దేశపు సంగీతాన్ని చులకన చేయడం కన్నతల్లిని దూషించినంత నేర, ద్వేషించినంత పాపం.


అయితే మన భారతీయ సంగీతం కేవలం ఏడు అక్షరాలు తీసుకుని, స ప స అంటూ గంటలు గంటలు లాగడమేనా? ఇంకా ఏమైనా  మహాత్యం ఉందా?

No comments:

Post a Comment