ఒకే బాధ -- నాలుగు భాషల పాటలు :
*********************************************************************************
1. హిందీ : దూర్ గగన్ కి చావో మే:-
కిషోర్ కుమార్ అనగానే మనకు డూడ్లింగ్ పాటలే గుర్తుకు వస్తాయి. కాని ఆతను బహుముఖ ప్రజ్ఞాశాలి , ఎలాంటి పాటనైనా పాత్ర లోకి దూరి పాడతాడు. కిషోర్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ' దూర్ గగన్ కి చావోన్ మే ' చూస్తె మనకి అతని ప్రతిభ అర్ధం అవుతుంది. ఈ సినిమాకు కథ,
సంగీత దర్శకత్వం, హీరో గా కూడా చేశాడు.
ఈ సినిమాను తమిళం, తెలుగు, మలయాళం లో కూడా పునర్నిర్మించారు. తమిళం లో నిలవే ఎన్నిడం అనే పాటను మొన్న పోస్ట్ చేశాను.
రచన: శైలేంద్ర.
సంగీతం: కిషోర్ కుమార్ ( ఈ పాటను అహిర్ భైరవి - చక్రవాకం రాగం లో స్వరపరిచారు )
అభినయం: కిశోర్ కుమార్, సుప్రియా చౌదరి.
*****************************************************************
कोई लौटा दे मेरे बीते हुये दिन
बीते हुए दिन वो मेरे प्यारे पलछीन
मेरे ख्वाबों के महल, मेरे सपनों के नगर
पी लिया जिन के लिये, मैने जीवन का जहर
आज मैं ढूंढू कहा, खो गये जाने किधर
बीते हुए दिन वो मेरे प्यारे पलछीन
मैं अकेला तो न था, थे मेरे साथी कई
एक आँधी सी उठी, जो भी था ले के गयी
ऐसे भी दिन थे कभी, मेरी दुनियाँ थी मेरी
बीते हुए दिन वो मेरे प्यारे पलछीन
*****************************************************************
గడచి పోయిన రోజులను ఎవరైనా తిరిగి ఇవ్వగలరా?
గడచిన రోజులు అవి నా అందమైన జ్ఞాపకాలు ||గడచి||
నా కలల మందిరం - నా స్వప్న నగరం
ఎవరి కోసం నేను జీవన గరళాన్ని తాగానో
ఎటుపోయరో వారిని ఈ రోజు వెదుకుతున్నాను ||గడచి||
ఒంటరిగా లేను నేను - నావాళ్ళు చాలామంది ఉండేవారు
ఒక తుఫాన్ వారందరినీ తీసుకుపోయింది
ఒక రోజు నాకంటూ ఒక ప్రపంచం ఉండేది ||గడచి||
******************************************************************************
2
No comments:
Post a Comment