Tuesday, 22 September 2015

పోతన  భాగవత  ఉద్భవ  దినోత్సవం  నేడు :  బాద్రపద  శు. నవమి :

*********************************************************************************

ప్రపంచ   సాహిత్యం  లో   పోతన   కవిత్వం   అజరామర మైనది.   ఆయన  కవిత్వ  పటిమ  అనితర  సాధ్యం. 

నేడు   భాగవత  ఉద్భవ   దినోత్సవం   సందర్భంగా    పోతన   కవితా  పటిమను   తెలియ జేసే ఒక  పద్యం   గురించి తెలుసుకుందాం.

పోతన - లెక్ఖల  మాస్టారు:
***********
a2+b2= (a+b)2   ఇది  ఆల్జీబ్రాలో  ఒక   సాధారణ  సూత్రం.  పై  సూత్రములో  a, b లకు  ఏ  విలువా  లేదు,  వాటి   స్తానంలో  మనం   ఏ  అంకె  వేస్తె  అదే   వాటి    విలువలు  అవుతాయి. 
ఈ  సూత్రాన్ని   పోతన   ఒక పద్యం  లో  సాధించారు.  ఆ  పద్యం........

ఉ||    ఎవ్వనిచే  జనించు   జగమెవ్వని లోపల నుండు  లీనమై 
         యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు  మూల   కారణం 
         బెవ్వ  డనాది మధ్య లయుడెవ్వడు సర్వము  తానే యైన  వా 
         డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే  శరణంబు  వేడెదన్.

పై  పద్యములో  ఎవ్వని   అనే పదం  పై  ఆల్జీబ్రా లోని   సూత్రం లాంటిది.  ఎవ్వని   వచ్చినప్పుడల్లా  మీరు  మీకు   ఇష్టం వచ్చిన  దేవుని  పేరు  వేసుకున్నా  అర్ధం   మారదు.   ఈశ్వర్, అల్లా, యేసు, గురునానక్, సాయి  ఎవరైనా  పర్లేదు,  ఏ మతం  వారైనా  వారి  వారి  మతాలకు   అనుగుణంగా  ఈ పద్యాన్ని మార్చుకొని  చదువుకోవచ్చు.  ఉదాహరణగా  క్రైస్తవులు  ఈ పద్యాన్ని   ఈ  విధంగా  అర్ధం  చేసుకోవచ్చు......
   యేసు వల్ల  జనించినది ఈ లోకం, యేసు  లోనే  ఉండి   లీనం అవుతుంది , ఎసుయే  ఈ  లోకానికి మూలకారణం. ఎసుయే అనాది, మధ్య లయుడు,  సర్వమూ   
  యేసుయే,  అలాంటి  యేసును  నేను  శరణం  అంటాను.
కాబట్టి   పోతన  లెక్ఖల  మాస్టారు  లా  ఈ  పద్యాన్ని   రచించి,  యూనివర్సల్  పద్యాన్ని   చేశారు.   






చిత్తూర్   వి. నాగయ్య   గారి  ' భక్త  పోతన '  చిత్రం   నుండి    పద్యం   విని   ఆనందించండి .



No comments:

Post a Comment