2. నిలవే ఎన్నిడం - రాము (తమిళ్ )
*********************************************************************************
పాట పేరు: నిలవే ఎన్నిడం
చిత్రం : రాము (తమిళం)
రచన: కన్నదాసన్
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్
భాగేశ్రి \ భాగేశ్వరి\ కాపి \ శ్రీరంజని
గానం: పి. బి. శ్రీనివాస్
అభినయం: జెమిని గణేషన్, కే. ఆర్. విజయ.
దర్శకత్వం: ఏ.సి. త్రిలోక్ చందర్.
భాగేశ్వరి మియాన్ తాన్ సేన్ సృష్టి. దీన్ని మూడో ఝాము రాత్రి పాడతారు. ప్రియుని పునర్ సంగమం కోసం అలమటించే ప్రియురాలి మనస్తత్వం తెలిపే రాగం.
స్వర స్థానాలు : స గ మ ద ని స --స ని ద మ ప ద గ రి స ; కర్నాటక సంగీతం లో : స చ.రి సా.గా శు.మ చ.ద కై.ని - స ని ద ని ప మ గ రి స
రాగలక్షనాన్ని ఈ పాటకు సరిగ్గా ఉపయోగించుకున్నారు విశ్వనాధన్ గారు. సమయం రాత్రి. నాయకుడు చనిపోయిన తన భార్యను తలుచుకుంటూ, ఇప్పుడు
తనని ప్రేమిస్తూన్న నాయకిని వారిస్తూ పాడిన పాట. కన్నదాసన్ గారు నాయకుని మనస్తత్వాన్ని సరిగ్గా ప్రతిబింబించారు. శోకము, ఆర్తి, వేదాంతం కలగలిసి ఈ పాట తయారయ్యింది.
రొమాంటిక్ హీరో గా పేరుపొందిన జెమినీ గణేశన్ ఈ పాటలో విషాదాన్ని చక్కగా అభినయించారు, కే. ఆర్. విజయ తెల్ల చీరలో దేవకన్యవలె మెరిసింది.
ఎం. ఎస్. విశ్వనాధన్ స్వరపరిచిన , పి. బి. శ్రీనివాస్ ఆలపించిన టాప్ టెన్ తమిళ పాటల్లో ఇది తప్పకుండా చేరుతుంది.
*****************************************************************
பாடியவர் - பி.பி.ஸ்ரீனிவாஸ்
படம் - ராமு
நடித்தவர் - ஜெமினி கணேசன்
நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை
நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை
மலரே என்னிடம் மயங்காதே
நீ மயங்கும் வகையில் நான் இல்லை
நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை
கோடையில் ஒரு நாள் மழை வரலாம்
என் கோலத்தில் இனிமேல் எழில் வருமோ
கோடையில் ஒரு நாள் மழை வரலாம்
என் கோலத்தில் இனிமேல் எழில் வருமோ
பாலையில் ஒரு நாள் கொடி வரலாம்
என் பார்வையில் இனிமேல் சுகம் வருமோ
நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை
அமைதியில்லாத நேரத்திலே
அமைதியில்லாத நேரத்திலே
அந்த ஆண்டவன் என்னையே படைத்து விட்டான்
நிம்மதி இழந்து நான் அலைந்தேன்
இந்த நிலையில் உன்னை ஏன் தூது விட்டான்
நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை
மலரே என்னிடம் மயங்காதே
நீ மயங்கும் வகையில் நான் இல்லை
நிலவே என்னிடம் நெருங்காதே
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை
*****************************************************************
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
malare ennidam mayangathe
nee mayangum vahaiyil naanillai
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
kodaiyil oru naal mazhai varalaam
en kolaththil inimel ezhil varumo
kodaiyil oru naal mazhai varalaam
en kolaththil inimel ezhil varumo
paalaiyil oru naal kodi varalaam
en paarvaiyil inimel suham varumo
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
oomaiyin kanavai yaar arivaar
oomaiyin kanavai yaar arivaar
en ullathin kathavai yaar thirappar
moodiya megam kalaiyumunne
nee paada vanthaayo vennilave
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
amaithi illatha nerathile
amaithi illatha nerathile
antha aandavan enaiye padaiththu vittan
nimmathi izhanthe naan alainthen
intha nilaiyil unnai aen thoothu vittan
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
malare ennidam mayangathe
nee mayangum vahaiyil naanillai
nilave ennidam nerungathe
nee ninaikkum idaththil naanillai
*****************************************************************
నిలవే ఎన్నిడం నేరుంగాదే - నీ నినైక్కుం ఇడత్తిల్ నాన్ ఇల్లై
మలరే ఎన్నిడం మయంగాదే - నీ మయంగుమ్ వగై యిల్ నానిల్లె ||నిలవే||
కోడై యిల్ ఒరునాల్ మలై వరలామ్ - ఎన్ కోలత్తిల్ ఇనిమేల్ ఏళిల్ వరుమో
పాలై యిల్ ఒరునాల్ కొడి వరలామ్ - ఎన్ పార్వై యిల్ ఇనిమేల్ సుగమ్ వరుమో ||నిలవే||
ఊమైయిన్ కనవై యార్ అరివార్ - ఎన్ ఉల్లత్తిన్ కదవై యార్ తిరప్పార్
మూడియ మేగమ్ కలైయుం మున్నే - నీ పాడవందాయో వెన్నిలవే... ||నిలవే||
ఆమైది ఇల్లాద నేరత్తిల్ - అన్ ద అన్ డవన్ ఎన్నైయే పడైత్తు విట్టాన్
నిమ్మది ఇలందే నాన్ అలైన్దేన్ - ఇన్ ద నిలైయిల్ ఉన్నై ఏన్ తూదు విట్టాన్ ||నిలవే||
*****************************************************************
జాబిలీ నన్ను సమీపించకు - నీవు అనుకొన్న చోట నేను లేను
పువ్వా నన్ను చూసి మైకం లో పడకు - నీవు మైకం లో పడేట్టుగా నేను లేను ||జాబిలీ||
వేసవిలో ఒకనాడు వాన రావచ్చు - నా తీరులో ఇకపైన సొగసు వచ్చేనా
ఎడారిలో ఒకనాడు పూల తీగ రావచ్చు - నా చూపులో ఇకనైనా సుఖం వచ్చేనా? ||జాబిలీ||
మూగ కల ఎవరికి తెలిసెను - నా హృదయపు వాకిలిని ఎవరు తెరిచేరు
ముసిరిన మేఘం చెదరే ముందు - పాడడానికి వచ్చావా తెలి జాబిలీ ? ||జాబిలీ||
ప్రశాంతత లేని వేళ - ఆ భగవంతుడు నన్ను సృష్టించాడు
నెమ్మది కోల్పోయి నేను అలమతిస్తున్నాను - నిన్ను దూతగా ఎందుకు పంపాడు? ||జాబిలీ||
No comments:
Post a Comment